/* GOOGLE ANALYTICS CODE-------------------------------- */

Tuesday 20 August 2019

నువ్వే నువ్వే !!

ధన, దర్పాలని  అర్ధం నువ్వు వస్తేనే కదా కలిగేది...
వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలు...పుట్టిందే నీకోసం కదా...
మాల్స్, మెర్సిడెజ్లు నువ్వు లేకుండా వ్యర్ధమైనవే కదా...
రోజుకో ఫాషన్, పూటకో వేషం, అన్ని చూపు నోచుకోదనికే కదా..
కవితలైనా, తవికలైనా...నీ అందం వర్ణిస్తేనే కదా దానికి అందం...
ఉరి తాడులా మెడచుట్టూ కేమేరను వేసుకునేది నీకోసం కాదా...
లేన్సులకు సెన్సు వచ్చేది నీ నవ్వుని ఓడిసిపట్టినపుడే కదా...
ప్రేమకి, అనురాగానికి పుట్టినిల్లువి, కోరికల భండాగారంవి నువ్వే కదా...
నీ గారాలు లేకపోతె శృంగారం ఏముంది...శృంగారం లేనిదే ప్రపంచం ఏముంది....
నువ్వే నువ్వే...మగవాడి  ప్రపంచమే నువ్వు...

Thursday 27 October 2016

వేదన!

కళ్ళు తెరిచి క్రూర మృగాల మధ్యకి వెళ్లాలంటే భయమేస్తుంది! జంతువులైతే కాస్త భయపడతాయి కానీ మనుషులైపోయారు. నిర్భయంగా ఉండమని చెప్పినా, అడుగడుగునా భయమే నిండుకుంది. గుండెలనిండా భయంతో అడుగులువేస్తున్న నా చుట్టూ అవకాశంకోసం ఎదురు చూస్తున్న గుంటనక్కలు, కళ్ళనిండా కామంతో రగిలిపోతున్న మృగాలని తప్పించుకుని అడుగులు ముందుకు పడాలంటే యుద్ధంలో ఫిరంగుల ముందు నిలబడినంత ధైర్యం కావాలి. గుంటనక్కల కళ్ళలో నా శరీరం నలిగిపోతున్నా, మొహంలో ఆ తాలూకు భావాలేమి కనపడకుండా ధైర్యం నటిస్తున్నా. భయపడేవారిని వెంటపడీ  మరీ భయపెడుతుందీ సమాజం. నా శరీరం మీద ఉన్న వస్త్రాలని నేను ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నా శీలానికి నేను పరీక్ష పెట్టినట్టే, నా శరీరాన్ని గుంటనక్కలకి అప్పగించేసినట్టే, కొన్ని మృగాలకి అది పిలుపు అవుతుంది, కొన్నింటికి అదే అవకాశం అవుతుంది. నా ప్రమేయం లేకుండానే నేను మృగాలకి తృప్తినిచ్చే ఆహారాన్ని అవుతాను. నేను లేకుండా పుట్టుకలేదు కానీ, నా పుట్టుకే ప్రశ్నార్ధంగా మారింది. నాకంటూ ఒక ప్రపంచం, నన్ను సాటి మనిషిలాగే చూసే కళ్ళ కోసం మరో ప్రపంచం పుట్టాలేమో! స్వర్గంలో కూడా శృంగారాన్నే కోరుకునే ఈ జాతి కంటే హీనమైన మరో ప్రాణి భూమి మీద ఉండదేమో.

పేర్కొన్న నా భావాలకి సమయం, వయసుతో సంబంధం లేదు, వరసకి నేను - అమ్మని ,అక్కని,చెల్లిని,చిన్నారిని! 

Monday 3 October 2016

మతం వ్యసనం - మనిషి - భారతదేశం


విభజించు - పాలించు అనేది తెల్లవాడి తెలివితేటలకు నిదర్శనం. అదే సూత్రాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం. కులం - మతం, ధనిక - పేద, ఆడ-మగ ఇలా ప్రతి విషయంలో మన నాయకులు తమ గెలుపుకి సూత్రంగా పాటిస్తున్నారు.  ఈ విధానాన్ని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు మరియు బిజెపి చాలా చక్కగా ఉపయోగించుకున్నాయి. కాంగ్రెస్ మతాలకి, కుల సమీకరణల ద్వారా లబ్ది పొందగా, బిజెపి మాత ఘర్షణలు సృష్టించి, హిందుత్వమే ప్రదాన మతంగా ఉన్న మన దేశంలో వారి ఉనికికే ప్రమాదం ఉందనే విధంగా ఎలా సృష్టించి లాభ పడిందో, నాకున్న సమాచారంతో కింద రాయడం జరిగింది.

నోట్: నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా రాయడం లేదు. ఎందుకంటే, ఇతర దేశాల్లో తీవ్రవాదులు వొంటి మీద బాంబులు ధరిస్తారు, మన దేశంలో ఖద్దరు చొక్కాలు వేసుకుని పార్లమెంట్ లో కూర్చుంటారు.
మతం అనేది మన జీవన శైలిని సక్రమ మార్గం లో పెట్టడానికి ఉన్నదే కానీ జీవితాలనే అంకితం చేసి ప్రాణాలు తీయడానికి కాదు అనేది నా అభిప్రాయం. "మత బానిసలు" అనే ఈ పదం ఒక మతానికి ఉద్దేశించినది కాదు, ప్రతి మతంలో వీరు ఉన్నారు. జీవితం లో అత్యధిక భాగం మతాన్ని రక్షించడం కోసం వెచ్చిస్తున్న బానిసలని చుస్తే జాలి కలుగుతుంది. తన ఉనికిని చాటుకోవడానికి దేవుడు మనుషుల్ని వాడుకుంటున్నాడంటే 'దేవుడు' అనే మాటకి అర్ధం లేదు. ప్రాణాలు నిలబెడితేనే దేవుడవుతాడు, తీస్తే దేవుడని ఎలా అనగలం. ప్రతి మతంలో  ఆయా దేవుళ్ళు తమ ఉనికిని కాపాడుకోడానికి ప్రాణాలను బలి కోరినవాళ్ళే...మతాలు, దేవుళ్ళు, భ్రమలో నుండి బయటకి వచ్చి ఆ మత గ్రంధాలు చెప్పిన  మంచి మాటలు ఆచరిస్తూ, జీవితాన్ని ఆనందంగా అనుభవించాలనేది నా మనవి. 
***********************************
1984 - రెండు లోక్ సభ సీట్లు గెలుచుకున్న ఆ సమయం లో అద్వానీ అనే ఒక మత మౌఢ్యునికి బృహత్తరమైన ఆలోచన వచ్చింది. అదేమంటే, నాలుగేళ్ల క్రితం వి.హెచ్.పి పాడి వదిలేసిన ''రామ జన్మ భూమి'' పాటని అందుకుందాం అని. వచ్చిందే తడవుగా, తన లాంటి, తనకంటే మూర్ఖులని కొంతమంది పోగు చేస్కుని రథయాత్ర ప్రారంభించాడు. మతం అనే మత్తు మందుకి మనిషి బానిస. పేరు ఏదైనా కావొచ్చు, భావాలు మాత్రం ఒక్కటే. సరిగ్గా దీన్నే తన రథ చక్రాలుగా మార్చుకున్న అద్వానీ మరియు అతని అనుయాయులు ఆ బానిసల్ని ఇటుకలు తెమ్మన్నారు, మట్టిని తెమ్మన్నారు. మత్తులో ఉన్నవాడి మెదడు పనిచేయదుకదా, అలాగే కానిచ్చారు మన బానిస సోదరులు. ఈ పాట జనాల నోట పలికించడానికి ఆ పార్టీకి కొన్నేళ్లు పట్టింది.

1989 - ఆ పాట రాగం ఎక్కించిన మత్తు ఈసారి పార్టీకి 86 లోక్ సభ సీట్లు ఇప్పించింది. 2 నుండి 86 సీట్లు గెలుచుకోడానికి పట్టిన సమయం ఐదేళ్లు. చేసిన పని పాట పాడటమే. అధికారం కావాలంటే మరిన్ని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనేం, 86 సీట్లు అప్పటి నేషనల్ ఫ్రంట్ (వి.పి.సింగ్) ని అధికారం లో నిలబెట్టడానికి కీలకం అయింది. కానీ అది కేవలం 16 నెలలు మాత్రమే అధికారం లో ఉంది మళ్ళీ ఎన్నికలు జరగడానికి కారణమైంది.

1986 & 1990 - ఈ రెండు సంవత్సరాలు కూడా మనకి చాలా ముఖ్యమైనవి. ఎంచేతనంటే, నేను ముందుగా చెప్పినట్టు మతానికి అందరూ బానిసలే. అద్వానీ 80 శాతం పైగా ఉన్న హిందువులని, వారి మతానికి కీడు పొంచి ఉంది అనేదాన్ని ఎలా అయితే భ్రాంతి కలిగించాడో, అదే రకమైన భ్రాంతిని కాశ్మీర్ లో గుల్ షా అనే మరో మత మౌఢ్యుడు అక్కడ బానిసలకి కలిగించాడు. అంతే కాదు, ఎలాగైతే బాబ్రీ మసీదుని పడగొట్టి రాముడి కి గుడి కడతానని అంటున్నారో, అదే విధంగా కాశ్మీర్ లో హిందూ దేవాలయాల్ని పడగొట్టి పెద్ద మసీదు కడతానని ప్రచారం ప్రారంభించాడు. అక్కడ బానిసలు దానికి సమ్మతంగా 'అనంతనాగ్' అనే ప్రాంతంలో మత ఘర్షణలు చేయడం, ఆ ప్రభుత్వం పడిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. వీళ్ళే ఇప్పుడు ప్రత్యేక కాశ్మీర్ కోసం పాకిస్థాన్ తో చేతులు కలిపి పోరాటం చేస్తున్నారు. రాజకీయ కారణాలు, దేశంలో అప్పటికే మతాల మధ్య నెలకొని  ఉన్న గంభీర వాతావరణం, వెరసి అక్కడ ఎప్పటి నుండి నివసిస్తున్న కాశ్మీరీ పండిట్స్ ఆస్తులు, ఆప్తులని వదులుకుని దేశ విభజన సమయాన్ని తలిపించేలా మరో సారి హింసాత్మక పరిస్థితుల మధ్య కాశ్మీరు లోయని వదిలేసి మిగిలిన రాష్ట్రాల్లోకి పొట్ట చేత పట్టుకుని వెళ్లిపోయారు. మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ మామూలే. అయితే ఈ సందర్భంలో స్వార్ధానికి మతం అనే రంగు పులుముకుని ఉన్న స్వార్థపరుల అధికార దాహానికి బలి అయింది అమాయకపు ప్రజలు (హిందూ/ముస్లిం). ఈ ఘర్షణలు అన్నింటికీ పాకిస్థాన్ సహాయం అందించింది.

1991 - విచిత్రంగా, భారత దేశంలో అన్ని మతాల వారికి తమ మతం ప్రమాదంలో ఉంది అనే భావన పెరిగింది. అద్వానీకి కోరిక పెరిగింది, మతం అనే మత్తు మందు మరింత సరఫరా చేస్తే మరిన్ని సీట్స్ వస్తాయ్ అని భావించిన అద్వానీ, 1991 ఎన్నికల వేళ తన గొంతుని సవరించి మరింత గట్టిగా పాడారు. వారి ఎన్నికల మేనిఫెస్టో లో ముందు పేజీ నుండి చివరి పేజీ వరకు కనపడేది "రామ జన్మ భూమి నిర్మాణం మరియు బాబ్రీ మసీదు కూల్చివేత" మాత్రమే. వారికీ అధికారం కేవలం మతాన్ని కాపాడటానికే అనేది వారి మేనిఫెస్టో చెప్తుంది. ఈసారి 121 సీట్లు వచ్చాయి. అప్పటికి అధికారం దక్కకపోయినా, సీట్ల సంఖ్య పెరగడం సంతోషంతో పాటు తమ తదుపరి కార్యాచరణకి ఆజ్యం పోసింది. అదే సమయం లో మరో పక్క కాశ్మీర్ లో 4th రాజపుతాన రైఫిల్స్ యూనిట్ (ఇండియన్ ఆర్మీ కి చెందిన ఒక బెటాలియన్), ''కునాన్ పోష్పుర" అనే గ్రామంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, ముస్లిం మతానికి చెందిన ఆడవాళ్ళని (13 సం.- 70 సం.) అందరిని మాన భంగం చేశారు. ఈ సంఘటన అక్కడ హిందువుల పాలిట శాపంలా మారి అనేక మంది ఊచకోతకు కారణమైంది.


1992 - ఇక లాభం లేదు, ఈ మతం మత్తుని అత్యున్నత స్థానానికి తీస్కెళ్ళాల్సిందే అని భావించిన పార్టీ, వి.హెచ్.పి సంస్థని ముందు పెట్టుకుని, బాబ్రీ మసీదు ని కూల్చేదాకా నిద్రపోలేదు. కూల్చడానికి కూలీలని, వారికి దిశా నిర్ధేశం చేసి ట్రైనింగ్ ఇప్పించింది ప్రవీణ్ తొగాడియా మరియు ఉమా భారతి (ప్రస్తుతం మంత్రి). ఇప్పుడంటే పండగలకు, ఆగస్టు 15, జనవరి 26 కి టీవీల్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నారు కానీ అద్వానీ పాట పాడక మునుపు అందరూ అలాగే ఉండేవారు. మసీదు కూల్చిన వెంటనే బొంబాయిలో అల్లర్లు చెలరేగడం, అనేక మంది ముస్లింలని ఊచ కోత కోయడం వెను వెంటనే జరిగిపోయాయి.

1993 - మసీదు కూల్చిన ఘటన నుండి దేశం తేరుకునేలోపు బొంబాయి బాంబుల మోతతో మారు మ్రోగిపోయింది. దావూద్ ఇబ్రహీం అనే మాఫియా లీడర్ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా బాంబుల మోత మోగించాడు. మసీదు కూల్చి, తద్వారా రాజకీయ లబ్ది పొందిన బిజెపికి ఇది మేధావుల వ్యతిరేకతకి సమాధానంగా చూపెట్టడానికి బాగా ఉపయోగపడింది.

1996 - రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. బిజెపి కి 161 సీట్లు వచ్చాయి. కానీ ప్రత్యర్ధులు కూడా అధికారానికి అంతే దూరంలో నిలబడ్డాయి. ఫ్రంట్ లు ఏర్పడ్డాయి. ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో వివిధ పార్టీల మద్దతుతో బిజెపి 13 రోజుల పాటు వాజపేయి ప్రధాన మంత్రిగా అధికారంలో నిబడింది. తరువాతి సమీకరణాలు దేవెగౌడ ని ప్రధాన మంత్రిగా చేశాయి.

1998 - మరో సారి రాజకీయాలు సామాన్య ప్రజలని మరచి అధికారం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. సమీకరణాలు మళ్ళీ వాజపేయి ని అధికారంలో నిలబెట్టాయి. కింద మీద పడుతూ ప్రభువని నడిపిస్తున్న బిజెపికి మరొక అవకాశం 1999 లో తలుపు తట్టింది.

1999 - ఏప్రిల్ నెలలో జయలలిత బిజెపికి మద్దతు ఉపసంహరించుకోవడంతో, మరొకసారి ఎన్నికల నగారా మోగింది. అదే సమయం లో తాత్కాలిక ప్రధానిగా వాజపేయి ని రాష్ట్రపతి నియమించడం జరిగింది. కొద్దిరోజుల తర్వాత అనగా, మే 3 న మొదలైన కార్గిల్ యుద్ధం జులై లో ముగిసింది. దీని వెనుక బిజెపి హస్తం ఉందని అనడం లేదు కానీ, మరోసారి ముస్లిం లేదా పాకిస్థాన్ మీద పై చేయి సాధించడం బిజెపి కి కలిసొచ్చింది. దీని వలన, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎన్డిఏ కూటమిలా ఏర్పడి 270 సీట్లు సాధించి అధికారం సొంతం చేసుకుంది బిజెపి. అధికారం  వచ్చేసాక బహుశా బిజెపి హిందూ మతానికి
ప్రమాదం  తప్పినట్టు భావించింది , ప్రజలు కూడా అలాగే భావించి  అయోధ్య ని పక్కన పెట్టి రాజకీయాలు చేసుకుంటూ 2004 వరకు పరిపాలన సాగించారు.

2002 - మరో రెండు సంవత్సరాలలో పదవీకాలం ముగుస్తుంది. రథం మీద అప్పటిదాకా నెట్టుకొచ్చిన బిజెపికి ఇదే సూత్రాన్ని గుజరాత్ లో ఎన్నికల వేళ బానిసత్వం ని అంచనా వేయడానికి ఉపయోగించారు...అప్పటి అక్కడ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీ  మరియు కేశూభాయ్ పటేల్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని దృష్టి మరల్చడానికి అభివృద్ధికి బదులు తమ ప్రియమైన "హిందూ - ముస్లిం వార్ వార్" అనే సూత్రాన్ని అమలు పరిచింది. గోధ్రా అనే నర వధని సృష్టించి, గుజరాత్ లో మత ఘర్షణలు చేసింది. ఫలితం - దేశమంతా మోడీ పేరు మారు మోగిపోయింది. మత బానిసలకి దేవుడయ్యాడు, బిజెపి అంటే మతాన్ని కాపాడే శక్తిగా చిత్రీకరించాడు, ముస్లిం మతానికి శత్రువు అయ్యాడు, చదువుకున్నవారికి, దేశానికి తీరని సమస్యగా మారాడు.

2004 - 2014 - అనుకున్నదొకటి అయిందొక్కటి అన్న తీరుగా, బిజెపి వ్యూహం పారలేదు. అనేక కారణాలు వలన బిజెపి మళ్ళీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది.

 2014- ఈరోజు - పూర్వీకులు నేర్పిన సూత్రాన్ని వంటపట్టించుకున్న మోడీ, అధికారం చేజిక్కించుకున్నాడు. అంతే కాదు,ప్రస్తుతం అనేక రకాలైన మత రక్షక సంఘాలు వెలిశాయి. వాళ్ళని ఆపడానికి ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే సూత్రం అమలవుతోంది. ఎన్నికలు మరో సంవత్సరంలో, ఆరు నెలలో ఉందనగానే మాత ఆయా రాష్ట్రాల్లో మత ఘర్షణలు ప్రారంభం అవుతాయి. బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఘర్షణలు దానికి సాక్ష్యం. కొన్నిసార్లు సఫలం అవుతున్నారు, మరికొన్ని సార్లు చేదు అనుభవాలు చూసింది బిజెపి. మరి కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉండబోయే బిజెపి, ప్రజా సంస్కరణా కార్యక్రమాలు బదులు ఎటువంటి మత సంస్కరణలు చేపడుతుందో అని నాబోటి అల్పులు భయపడుతూనే ఉన్నారు.  గోరక్షక్ దళ్, భజరంగ్ దళ్, ఆ దళ్, ఈ దళ్ అంటూ రోజుకో పుట్టగొడుగు పుట్టుకొస్తూనే ఉన్నాయ్.

బిజెపి ప్రతి గెలుపు సూత్రం మతాల్ని రెచ్చగొట్టి, హత్యాకాండని జరిపించడమే అనిపిస్తుంది. మతపరంగా సున్నిత మైన అంశాలని ఉద్దేశపూర్వకంగా నే రెచ్చగొడుతూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ఈ మత పిచ్చి మూర్ఖులు పాకిస్థాన్ తీవ్రవాదులకు, ఇరాక్ ISIS సంస్థలకి తీసిపోదని నా భావన !! 

Thursday 22 September 2016

ఎటు పోతోందీ మానవ జాతి !!


మనుషులు మృగాలుగా మారుతున్న రోజులివి,
మనిషి జన్మ స్థలమే కుక్కలు చింపిన విస్తరి అవుతున్న రోజులివి,
ప్రేమ త్యాగానికి బదులు ప్రాణాలని కోరుకుంటుంది,
శారీరక సుఖానికి బిడ్డలనే  అడ్డు తొలగించుకునేవాళ్ళు కొంతమందైతే,
అదే బిడ్డలని వాడుకుంటున్న వారు మరికొందరు.
వయసు, వరస భేదం లేకుండా శృంగారంలో సుఖాన్ని వెతుక్కునే కుళ్ళిన మనసులు,
కడుపు నిండా కోట్లు రూపాయలు తింటున్న నాయకులు ఒక పక్క,
మతాలకి బానిసలైన మూర్ఖులు మరో ప్రక్క.
కరువుతో కన్ను మూసే రైతన్నలు ఒకపక్క,
ప్రపంచ కుబేరుల్లో స్థానానికి ఎగబాకుతున్న దోపిడీదారులు మరో ప్రక్క.
కలిసి కడ దాకా నడిచే కాళ్ళు కరువయ్యాయి,
కడ దాకా కలిసి ఉండే కుటుంబాలు కనుమరుగయ్యాయి!!
ప్రాణానికి విలువివ్వని ఈ సమాజం, కులానికిస్తుంది,
కన్న బిడ్డలకన్నా, కుల గౌరవాన్ని నమ్ముకున్న మూర్ఖులు
కనిపించని దేవుడి కరుణ కోసం, కనపడే ప్రాణాలు తీసే కర్కోటక జాతి,
కళ్ళముందే ప్రాణాలు విడుస్తున్నా కన్నెత్తి కూడా చూడదీ జాతి..
------------------------------------------------------------------------------------
తీరని కోరికల బిగి కౌగిలిలో బందీ ఈ మనిషి,
కానరాని ఆశల ఆకాశంలో తల్లడిల్లిపోతున్నాడీ మనిషి,
స్వర్గంలో ఉంటూనే, తన ఆత్మ కోసం మరో స్వర్గాన్ని వెతుకున్నాడీ మనిషి,
ప్రాణాలు తీయడానికి పోటీలు పడుతున్నాడీ మనిషి,
జీవితమనే పరుగుపందెంలో ప్రాణం శాశ్వతం కాదని తెలుసుకోలేకపోతున్నాడీ మనిషి,
నాలుగునాళ్ళ జీవిత పరమార్ధం డబ్బుతోనే ఉందనుకుంటున్నాడీ మనిషి,
తన మనసుతో పాటు భూతలాన్ని కలుషితపరుస్తున్నాడీ మనిషి,
ఆధునికతకు అర్ధం అరచేతిలో చరవాణి అంటాడీ మనిషి,
యుగాలు దాటినా, మనిషి మనసు మాత్రం అప్పటి చీకటి గుహలోనే బందీ !!

- సశేషం

Thursday 21 January 2016

భారతదేశం లో దేశభక్తి ప్రదర్శించడానికి హిందువే కానక్కర్లేదు

భారతదేశం లో దేశభక్తి ప్రదర్శించడానికి హిందువే కానక్కర్లేదు - ఈ సత్యం కొంతమంది అగ్రకుల గర్విష్టులకు, మూర్ఖులకు అర్ధం కాదు. హిందూ ధర్మం పాటించని ప్రతి ఒక్కడు దేశ ద్రోహిగా పరిగణిస్తున్న వారికి చరిత్ర సరిగా తెలియకపోవడమే కారణం. 'అణగారిన వర్గం', 'అంటరానితనం' అంటే ఒక పదం గానే మీకు పరిచయం, కాని అనేక కోట్లమంది దళితులకు అదే ఇంటి పేరు. ఇతర దేశాలలో నీకు అవమానం జరిగితే విల విల లాడే నువ్వు ఇక్కడ మాత్రం అదే గర్వం ప్రదర్శిస్తావ్. బిజెపి మరియు ఎబివిపికి మతపిచ్చే దేశ భక్తి గా అనిపిస్తుందేమో కాని, రెండిటికి చాలా తేడా ఉంది. సమయం వస్తే మీకంటే ముందు మేము ప్రాణాలు మా దేశం కోసం అర్పిస్తాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వాడికి భారత దేశం తల్లి లాంటిది. మీ దేశభక్తి అధికారం కోసం మాత్రమే! మత, కుల పిచ్చి వ్యాప్తి చేసి తద్వారా అధికారాన్ని, ఆధిపత్యాన్ని మీరు కోరుకుంటున్నారు. మత, కుల విద్వేషాలు లేపే సంస్థలు దేశాన్ని కాపాడుతాయా? ఇది మా దేశం, మాకు ఎలా కాపాడుకోవాలో, ఏమి చేసి ఋణం తీర్చుకోవాలో కుల బలుపుతో ఉన్న 'కొంత మంది' అగ్ర వర్ణాల నాయకులు చెప్పక్కర్లేదు. కుల రహిత సమాజం కావాలంటే మను ధర్మశాస్త్రం పాటించడం ఆపండి. హిందూ ధర్మమే దాని మీద వ్యాప్తి చెందింది, ఇంకా మీరేం నాగరికులు, మీరేం దేశ భక్తులు, మీరేం మనుషులు, అసలు మీరెవరు? మీకు దేశాన్ని ఎవడు రాసి ఇవ్వలేదు, నీకు ఎంత హక్కు ఈ భూమి మీద ఉందో, అంతే హక్కు, దమ్ము మాకు ఉన్నాయి. డబ్బు కోసం తెల్లవాడి పాదాలు నాకిన చరిత్రలు మీవి, నీకు నిజం గా దేశభక్తి ఉంటే కులాన్ని ఎప్పుడో నిర్మూలించి, నీ పేరు వెనుక తోకల్ని కత్తిరించేవాడివి. కులం తెచ్చి పెట్టె బలుపు కావాలి, అందరూ నీ మాట వినాలి, అధికారం కావాలి, ఆధిపత్యం చలాయించాలి, కాని ని నర నరాల్లో నిండి ఉన్న కుల గజ్జిని మాత్రం విడిచి పెట్టి అందరూ సమానమనే భావన మాత్రం రానివ్వరు.

నేను హిందువు గా పుట్టాను, కాని హిందువు గా మాత్రం ఖచ్చితంగా చావను !
 - డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 

Thursday 5 November 2015

ఇది నా...ఆలోచన - కులం । మతం

కులం, మతం  మూఢనమ్మకాలు అని నా అభిప్రాయమ్. కులం అనేది మన విజ్ఞతకి అతి పెద్ద అడ్డుగోడ. ఈ జబ్బు తో ప్రస్తుతం బాధపడుతున్న వాళ్ళ  లెక్కలెనిది.
కులం కులం అంటూ గళమెత్తి బడి లో పాఠం లా, చీకటిలో వెలుగులా, శరీరం లో రక్తం లా, గుడి లో మంత్రం లా, నడకలో చెప్పు లా,
మతం మనకి చెప్పేదాంట్లో మనకి నచ్చింది మాత్రమె మనం పాటిస్తున్నాం. మనకి నచ్చని అనేక అంశాలని అందరం వదిలేస్తున్నాం.

  

Tuesday 14 July 2015

నాకు తెలిసిన విప్లవం

ఒక మనిషి సమాజానికి సేవ  చెయ్యాలంటే,రాజకీయా పార్టీ కావాలా? రాజకీయ నాయకుల్లో మార్పు కంటే ముందు, ప్రజల్లో ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ఏ ప్రాతిపదికన, ఈ ప్రజలు ఓటు వేస్తున్నారో, దాన్ని ముందు పెకిలించాలి. నాయకత్వ లక్షణాలు, నిజాయితి మరియు పాలనా దక్షత ఆధారంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ఇంగిత జ్ఞానం కలిగించాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కాని రాజకీయలను ప్రక్షాళన చెయ్యాలంటే ఉద్యమాలు ఒక్కటే మార్గం. రాజకీయ నాయకులను మార్చడానికి రాజకీయ పార్టీ పెట్టడం అనేది ఎంత మాత్రము సబబు కాదు. విప్లవం అంటే స్వార్ధం, నా దేశ ప్రజలకి మంచి జరగాలనే స్వార్ధం అంతే కాని, నా కులానికి, నా స్నేహితులకి, నా కుటుంబానికి కాదు. అసలు విప్లవం అనే పదానికి అర్ధం తెలుసుకోవాలంటే  చదవాల్సింది గ్రంధాలయం లో పుస్తకాలు కాదు, గరీబు జీవితాలని. బాధలని చూసి చలించగలిగినోడు సాటి మనిషి అవుతాడు, తీర్చడానికి పోరాడేవాడు నాయకుడవుతాడు, తీర్చినవాడు దేవుడవుతాడు!! విప్లవం వర్ధిల్లాలి - మన నోట్లోనో, సోషల్ మీడియా గూట్లో నో కాదు, నిజ జీవితం లో వర్ధిల్లాలి!!

విప్లవం అనేది వెండి కంచంలో, ఖరీదైన కార్లలో  పుట్టినట్టు చరిత్రలో ఎక్కడా లెదు. కాలే కడుపులు, కొలిమిలో ఇనుము కంటే దారుణం గా కాలిపోతున్న పేదవాడి బ్రతుకులు, ఎడారి లో ఇసుక కంటే ఎక్కువగా ఎండిపోతున్న కడుపులు, సాయం కోసం సంవత్సరాలు గా ఎదురుచూస్తున్న కళ్ళలో నుండి పుడుతుంది